Pages

ఈనాడు లో నా కధ ... అమ్మో దురద

ఆగష్టు 29 th ఆదివారం ఈనాడు బుక్ లో వచ్చిన నా కధ 'అమ్మో దురద' చదవాలనుకొంటే ఈ క్రింద లింక్ ని విసిట్ చేయండి
http://www.eenadu.net/archives/archive-29-8-2010/htm/weekpanel2.asp
(ఈనాడు లో ఇప్పుడు గత 90 రోజులకు మాత్రమే ఆర్కైవ్ వుంచడం వల్ల ఈ లింక్ పనిచేయడం లేదు త్వరలో కధను బ్లాగ్లో ఉంచుతాను)

Tuesday, August 16, 2011

అన్నా హజారే x అవినీతి నాయకులు


   అవినీతి పై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజారే ను జైలులో పెట్టి భారత దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత నీచమైన స్థాయికి దిగాజారిపోయారో ప్రజలందరికీ నిస్సిగ్గుగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా.

  అక్రమ సంపాదన, అధికార దాహంతో ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్న ప్రస్తుత రాజకీయనాయకులు అవినీతి, అక్రమ సంపాదనలను అడ్డుకోడానికి సహకరించే ఏ బిల్లు నైనా ఆమోదింప చేస్తారని ప్రజలు భావించడం అత్యాసే. ప్రధాని, పార్లమెంట్, శాసన సభ్యులు మొదలుకొని గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబరు వరకు ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో వున్నా ఆసక్తి మరి ఎందులోనూ లేదు. ఈజిప్టు లాంటి దేశానికి ముబారక్ లాంటి వాళ్ళు ఒక్కరో, ఇద్దరో ఉండవచ్చు కానీ భారత దేశంలో కొన్ని వందలమంది ముబారక్ లు చెలరేగి పోతున్నారు.

 ప్రస్తుత పరిస్తుతులలో అన్నా చెప్పినట్టు మరో స్వాతంత్ర పోరాటం నిష్కలమైన పరిపాలన కోసం చెయ్యక తప్పదు. ఈ రోజు అన్నా హజారే అరెస్ట్ ప్రజాస్వామ్య వాదులను ఒకవైపు కంట తడి పెట్టిస్తూ మరోవైపు గుండెలు మండిస్తుంది. ప్రజాగ్రహానికి నిలబడిన రాజ్యాలు చరిత్రలో లేవు...ఇదే సరైన సమయం సమస్త ప్రజలు పిడికిలి బిగించి అక్రమార్కులను రాజకీయాలనుండి తరమడానికి, అది తొందరలోనే సిద్దిస్తుందని ఆశిద్దాం.




Tuesday, March 15, 2011

తెగించిన తెలిబాన్లు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాల కూల్చివేత తో తెలంగాణా తెలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్ లను మించిపోయారని రుజువు చేసారు. ఆ తాలిబాన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసినప్పటికంటే ఈ తెలిబాన్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం సాక్షి గా చేసిన ధ్వంస రచన సమస్త తెలుగు జాతిని నివ్వెర పరచింది, ఎంతో ఆవేదనకు గురి చేసింది.



తెలంగాణా వుద్యమం తో కూల్చివేయబడ్డ కవులు, కళాకారులు, జాతి నిర్మాణ కారులకు ఏమి సంబంధమో రాజకీయ పార్టీ ముసుగు వేసుకొన్న తెలిబాన్లు చెప్పాలి. తెలంగాణా సాధన లో హింసా, అరాచకం ఒక భాగమా? ఇప్పటికే ఒక కుటుంబం రౌడీ రాజ్యం తెలంగాణలో రాజ్యం ఏలుతున్న లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఈ విధ్వంసం వెనుక ఎవరి హస్తం వుందో అందరికి తెలిసిందే. శాసన సభ సాక్షిగా జయ ప్రకాష్ నారాయణ మీద దాడి చేయించిన తే రా సా (తెలిబాన్ పార్టీ) ఇంత హీనస్థితికి దిగజారుతుందని ఎవ్వరూ వూహించలేదు. తెలిబాన్లు సాగించిన విధ్వంసం వారికేమి ప్రయోజనం సాధించిపెట్టిందో తెలీదు కానీ తెలంగాణా వస్తే హైదరాబాద్ లో తెలిబాన్ల ఆగడాలకు అంతు వుండదని అక్కడ వున్న ఇతర ప్రాంతాల వారి ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని నిర్ద్వందం గా నిరూపణ ఐంది.


అసలు ఈ విధమైన అసహనానికి ఈ తెలిబాన్లు ఎందుకు గురిఅవుతున్నారో సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా వెనుకుబాటుతనం, ప్రభుత్వ కేటాయింపులలో అన్యాయం కారణంగా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకుపోతున్న వారికి శ్రీ కృష్ణా కమిటీ రిపోర్ట్ రూపం లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అన్ని రంగాలను కూలంకుషం గా అధ్యయనం చేసిన కమెటీ తెలంగాణా వాదుల ఆరోపణ లలో పస లేదని తెలంగాణా అన్ని రంగాలలో ముందంజలో వుందని తేల్చి చెప్పింది. నిజంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని ఆధారాలతో సహా చూపింది. పరిశ్రమలు కూడా తెలంగాణాలోనే ఎక్కువ ఏర్పాటు అయ్యాయని రిపోర్ట్ తెలిపింది (కొద్ది గా ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువ వున్నట్టు కనిపించినా వాటిలో చాలా వరకు రైస్ మిల్లులే అని రిపోర్ట్ లో పేర్కొనడం గమనించాలి) గృహ, వ్యవసాయ తలసరి విద్యుత్ వినియోగం కూడా తక్కిన రెండు ప్రాంతాల వారికన్నా తెలంగాణాలోనే ఎక్కువ అని కమీటి ప్రకటించింది. శ్రీ కృష్ణ రిపోర్ట్ రుచించని తెలిబాన్లు అదంతా అబద్ధాలపుట్ట అని ఆరోపించడం మినహా వాటిని అబద్ధాలు గా నిరూపించే ఆధారాలు చూపడం గాని, లేదా అవాస్తవాలను ఖండిస్తూ వారి రిపోర్ట్ ని విడుదల చేయడం గాని చేయలేకపోయారు. శ్రీ కృష్ణా కమిటీ క్రోడీకరించిన వాస్తవాల ఆధారంగా విస్పష్టం గా సమైఖ్య ఆంధ్రా కే మొగ్గు చూపడం తో దానిని జీర్ణించుకోలేని ఈ తెలిబాన్లు ప్రజాస్వామ్య బద్ధం గా వుధ్యమాన్ని కొనసాగించలేమనే అందోళనతో ప్రజా ప్రతినిదులపైన పైన భౌతిక దాడులు, విధ్వంసాలకు దిగజారారు.


విగ్రహాల విధ్వంసం తరువాత ఈ తెలిబాన్లు స్పందన కూడా వారి స్థాయి కి తగ్గట్టు గానే వుంది. వాళ్ళు చేసిన విమర్శ ‘ట్యాంక్ బండ్ మీద తెలంగాణా కవులుకు, వ్యక్తులకు’ స్థానం లేదా? అని. అసలు కవులు, కళాకారులు, సంఘసేవకులు, గొప్పనాయకులకు ప్రాంతాలతో ఏమి సంభంధం? ఒకవేళ ఎవరిదైనా విగ్రహం పెట్టాలని అనుకొంటే తెలియచేయడానికి ఇదా మార్గం?. తెలిబాన్ కి ఒక నాయకుడు కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం వాళ్ళ విగ్రహాలు పెట్టకపోతే ట్యాంక్ బండ్ మీద విగ్రహాల కు హామీ ఇవ్వలేమని అనడం ఈ తెలిబాన్లకు ఫైత్యం ఎంత ప్రకోపించిదో తెలుస్తుంది(బహుసా ఈ తెలిబాన్ నాయకులకు విగ్రహాలకోసం ఇప్పటినుండే కర్చిపులు వేసుకొంతున్నట్టున్నారు). మరో విమర్శ 600 మంది విద్యార్ధులు చనిపోగా లేనిది ఈ విగ్రహాలు కూలితే తప్పా? అసలు తలా తోకా లేని విమర్శ ఇది (బోడిగుండు కి మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే), విగ్రహాలే ఎందుకు కూల్చాలి? పోయి పోయి బిర్లా మందిర్ నో లేక చార్మినార్నో కూలిచి వేయవచ్చు కదా? లేదా సొంత కొంపలు కూల్చుకోవచ్చు కదా?. ఎంతో మంది విద్యార్ధులు చనిపోయారని మొసలి కన్నీరు కారుస్తున్న ఈ తెలిబాన్ నాయకులు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకు చావలేదో సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న ఒక టీవీ ప్రోగ్రాం లో ఈ తెలిబాన్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణా వుధ్యమం లో 500 మంది విద్యార్ధులు చనిపోయారు, సమైఖ్య ఆంధ్రా వుధ్యమం లో ఒక్క విద్యార్ధి ఎందుకు చనిపోలేదు? దీన్ని బట్టి తెలంగాణా వుధ్యమం బలంగా వుంది కనుక తెలంగాణా ఇచ్చెయ్యాలి అని ఒక సూత్రీ కరణ చేసాడు. అసలు ఏ వుధ్యమం లో ఐనా ఎవరినా ఎందుకు చనిపోవాలి? శవాలే వుద్యమ వుధ్రుతికి ప్రామాణికమా?సమైఖ్య ఆంధ్రా వుధ్యమంలో యువకులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదంటే కారణం అక్కడ బావోద్వేగాలను రెచ్చగొట్టే తెలిబాన్ నాయకులు వంటివారు ఎవ్వరూ లేరు. నేను గతం లో పోస్ట్ చేసిన ఒక ఆర్టికల్ లో నే స్పష్టం చేశా “చిదంబరం తెలంగాణా ప్రకటన తరువాత సీమాంద్ర ప్రాంతం లో గాలి కూడా ఆగింది అందుకే ప్రకటన వెనక్కు వెళ్ళింది” అని. ఒక మంచి నాయకత్వం అంటే ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, ప్రజలను సమీకరించాలి, వుధ్యమించాలి అంతే గాని బావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ శవాల వ్యక్తిగత స్వార్ధాలను తీర్చుకోవడం కాదు. ఈ రోజు తెలంగాణలో చనిపోయిన ప్రతి బిడ్డ తల్లి కి ఈ తెలిబాన్ నాయకులు సమాధానం చెప్పాలి.


ఈ తెలిబాన్ నాయకులను మహాభారత యుద్ధంలో ఆశ్వద్ధామ తో పోల్చుకోవచ్చు, యుద్ధం చివరలో తను ప్రయోగమే కానీ అదుపు చేయడం తెలియని అస్త్రం ప్రయోగించి చివరకు దానిని గర్భంలో వున్న వుపపాండవుల (పాండవుల పిల్లలు)మీదకు మళ్ళిస్తాడు చివరకు శ్రీ కృష్ణుడు చేతిలో శాపానికి గురై చండాలమైన జీవితం గడుపుతాడు (అక్కడా ఇక్కడా యాదృచ్చికం గా ‘శ్రీ కృష్ణ’ దే ప్రధాన పాత్ర !).. ఈ తెలిబాన్ నాయకులు తెలంగాణా అస్త్రం వుపయోగించి దానిని అదుపుచేయలేక తెలంగాణా పిల్లలవైపు మళ్ళించడం తో ఈ రోజు తెలగాణా లో తల్లుల లకు గర్భశోకం మిగిలింది. నాయకుడనే వాడు అర్జునుడులా పూర్తి అదుపు వున్నవాడిలా వుండాలి కానీ ఆశ్వద్ధామ(తెలిబాన్ నాయకుల) లా వుండకూడదు.


చివరగా ఒక మాట ఏ లోకంలో వున్నాదో గాని విప్లవ కవి శ్రీ శ్రీ ఆత్మ, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల విధ్వంసం చూస్తే ఆయన వ్రాసిన ఒక గేయం “కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు...” అనే దానిని బహుసా ఇలా మార్చి వ్రాస్తాడేమో “కొంతమంది యువకులు పుట్టుకతో మూర్ఖులు, తెలిబాన్లకు బానిసలు, సమాజానికి చీడపురుగులు....”


Friday, October 15, 2010

అవినీతి భారతం ..


పై ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ? నాకైతే అవినీతి వ్యవస్థ (బండి) ని లాక్కు వెళ్ళుతున్న భారతదేశం(గుర్రం) కనిపిస్తుంది. మీకు తోచిన సరదా కామెంట్స్ పంపించండి.

అవినీతి లో నీతి...

ఈమధ్య హాట్ టాపిక్ గా మారిన విషయాలలో జగన్ ముందస్తుగా చెల్లించిన రూ.84 కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఒకటి. దీని మీద చంద్రబాబు తో సహా అనేకమంది అంత సొమ్ము కట్టడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, విచారణ జరపాలని డిమాండ్ చేసారు. ఐతే టాక్స్ ఎలా కట్టాడు, ఎందుకు  కట్టాడు అన్న దాని మీద విచారణ జరగాలా లేక అంత టాక్స్ కట్టడానికి ఎంత డబ్బు దోచుకోన్నాడో, ఎలా దోచుకొన్నాడో అన్న దానిమీద విచారణ జరగాలా? ఒక బ్రహ్మాండమైన ఐడియా తో (సాక్షి కధనం ప్రకారం) దాదాపు ఏమి పెట్టుబడి లేకుండా భారతి సిమెంట్స్ లో 51% శాతం అమ్మి రూ .3000 కోట్లు పైగా  వచ్చిన విషయం అందరికి తెలిసిందే, ఇలా అధికారం అడ్డంపెట్టుకొని వనరులను దోచుకొని సంపాదించిన అవినీతి సొమ్ముకి చాలా నీతి గా, పారదర్శకం గా పన్ను  కట్టేసినందుకు అభినందించాలో లేక రాజమార్గంలో ఇకపై భారతి సిమెంట్స్ అవినీతిని నీతి గా మార్చినందుకు స్పందించాలో తెలియని పరిస్థితులలో చాలామంది పడిపోయారు. ఇకపై  భారతి సిమెంట్స్ గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. కోట్లు అనే మాట ని చలి కాలం వేసుకొనే కోట్లు అనేంత ఈజీ గా తీసుకొనే విధంగా  ప్రజల మనస్సులను మార్చేసిన ధన్య జీవి శ్రీ శ్రీ శ్రీ అవినీతి మహారాజ్ రాజశేఖర రెడ్డి కి దణ్ణం పెట్టుకొని ఓ  బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.  

పోల్ రిసల్ట్ - 'బాబ్రి' తీర్పు సరైనదేనని మీరు భావిస్తున్నారా?

పోల్ ఐన వోట్లు - 22

అవును -  20 (90 %)

కాదు - 2 (10 %)


Sunday, October 10, 2010

ఒక సువర్ణావకాశం ....



బాబ్రి తీర్పు వచ్చి రెండు వారాలు అవుతుండగా ఇరుపక్షాల మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఎక్కడా కానరావడం లేదు. ఇప్పుడు వివాద స్థలం కేవలం 1500 గజాలకే పరిమితమైనట్టు (ముందు 2.7 ఎకరాలు అనుకోన్నట్టు కాకుండా) తేటతెల్లం ఐ౦ది. 

దురదృష్ట వశాత్తు బాబ్రి మసీదు కూల్చివేత సంఘటన, గోద్రా అల్లరుల తరువాత ముస్లిం సమాజం భారతీయ భావనకు దూరంగా జరిగి వుగ్రవాదులకు వెన్నుదన్ను గా నిలవడం సమస్త భారతీయుల కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. కొంత మంది కి ఇది వర్తించక పోవచ్చ, కానీ దేహం భారత దేశంలోనూ ఆత్మ  పాకిస్తాన్ లోను వున్న జనాభా ఎంత మంది లేరు ? 

ముస్లిం చక్రవర్తుల దురహంకార దాడుల వల్ల అనేక మందిరాలు ధ్వంసం చేయబడి, జుట్టు కి కూడా పన్ను కట్టిన చరిత్ర తెలియంది ఏమి కాదు.  బాబ్రి మసీదు గొడవ ఈనాటిది కాదు 18 శతాబ్దం నుండి నలుగుతూ వచ్చి చివరికి ఇప్పటికి ఒక సామరస్యమైన తీర్పు వచ్చింది. మందిరం శిధిలాల మీద మసీదు కట్టినట్టు, దానికి మందిరానికి చెందిన స్తంబాలను వాడినట్టు , వాటిపైన హిందూ దేవతా విగ్రహాలు చెక్కి వున్నట్టు న్యాయ మూర్తులు విస్పష్టంగా పేర్కొనడాన్ని ముస్లిం సమాజం నిశితం గా పరిశీలించి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వుంది .కోర్టులలో తీర్పుల ద్వారా చరిత్ర ను సరిచేయాలని చూడడం సరికాదు కానీ బాబ్రి విషయం శతాబ్దాల తరబడి వివాదాస్పదం గా వున్నందున న్యాయ పరిష్కారం తప్పలేదు. 

ఇప్పుడు ముస్లిం సమాజం ముందు ఒక సువర్ణ అవకాసం నిలుచొని వుంది. బాబ్రి వివాదాన్ని కోర్టు సూచించిన విధంగా సామరస్యం గా పరిష్కరించుకోవడం గానీ, లేదా పూర్తిగా వదులుకొని పరిహారం గా వారికీ కావలసిన దానిని పొందటం కానీ చేయగలిగితే హిందూ, ముస్లిం ల మధ్య దూరం తగ్గించడమే కాకుండా వారి భారతీయ ఆత్మను ప్రదర్శించే ఒక గొప్ప అవకాశాన్ని పొందుతారు.