Pages

ఈనాడు లో నా కధ ... అమ్మో దురద

ఆగష్టు 29 th ఆదివారం ఈనాడు బుక్ లో వచ్చిన నా కధ 'అమ్మో దురద' చదవాలనుకొంటే ఈ క్రింద లింక్ ని విసిట్ చేయండి
http://www.eenadu.net/archives/archive-29-8-2010/htm/weekpanel2.asp
(ఈనాడు లో ఇప్పుడు గత 90 రోజులకు మాత్రమే ఆర్కైవ్ వుంచడం వల్ల ఈ లింక్ పనిచేయడం లేదు త్వరలో కధను బ్లాగ్లో ఉంచుతాను)

Tuesday, July 27, 2010

ఆ అనిల్ .. మా అనిల్ కాదు....


బ్రదర్ అనిల్ కుమార్ మీద ఈ మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి తో పాటు సాక్షి తప్ప ఇంచుమించు అన్ని తెలుగు పేపర్స్ లో వార్తలు గుప్పు మన్నాక, సాక్షి పేపర్ డామేజి కంట్రోల్ మొదలు పెట్టింది. ఐతే అన్ని పత్రికలూ ఆరోపించినా, సాక్షి మాత్రం ఈనాడునే ఎందుకు టార్గెట్ చేస్తుందో?. బయ్యారం మునిగింది అంటూ ఈనాడు లో వచ్చిన వార్తకు ప్రతి గా సాక్షి లో ఆ అనిల్ మా అనిల్ కాదు అంటూ పోటో తో సహా తండ్రి పేరు పేర్కొంటూ సాక్షి పెద్ద కదన్నాన్ని ప్రచురించింది. మొత్తం మీద ప్రజల మెదల్లను ఏమి అర్ధం కాని పరిస్థితి లోకి నెట్టడం  వాళ్ళకు ఒక మార్గం గా కనిపిస్తుంది. కాని జగన్, అనిల్ ప్రమేయం లేకుండా అంత పెద్ద కుంభకోణం జరిగిందంటే బుర్ర వున్నవాడు ఎవడు నమ్మడు. వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వ్యవహారం నడపడం రాజకీయ నాయకులు మాములే.....


అధర్మం గా ధర్మాన....


నిన్న కాక మొన్న సోంపేట లో మా పొట్ట కొట్టకండి, మా గాలి, నీరు, భూమి కలుషితం చేయకండి అని ఎలుగెత్తిన ప్రజల మీద కాల్పులు జరిపి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న సంఘటన ఇంకా మరవక ముందే. మంత్రి పదవి వెలగబెడుతూ బాధ్యతాయుతమైన స్థానంలో వున్న ధర్మాన మళ్లి పాత పాటే అందుకొన్నాడు. ఎవరు ఏమనుకొన్న , ఎందరు అడ్డు వచ్చినా పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామని సెలవిచ్చారు. ఒక పక్క అనుమతులు నేరకరించినా, ప్రజల వ్యతిరేకం గా ఉన్నప్పటికీ ఈయన గారు ఇంత మొండి పట్టుదలకు ఎందుకు పోతున్నారో అర్ధం కావడం లేదు, బహుసా ఈయన సంచి  బాగా బరువెక్కువఐ ఉండవచ్చు. పైగా ఈ మంత్రి గారు మాట్లాడుతూ నా జిల్లాకు ఏమి కావాలో నాకు తెలుసునని సెలవిచ్చారు. ఐతే ఈయనకు దమ్ము వుంటే ఆ ప్రాంత ప్రజల మధ్య ఒంటరిగా పర్యటించాలి. ఇటువంటి మంత్రి ఆ జిల్లాకు వుండడం ఆ జిల్లా వాసుల ఖర్మ అనుకోవాలి.

Saturday, July 24, 2010

జగన్ కొత్త పార్టీ పెడతాడా - పోల్ రిసల్ట్

పోల్లో పాల్గొన్న వారికి నా అభినందనలు. ఈ పోల్ లో 29 మంది పాల్గొనగా 76 % (22 మంది ) జగన్ కొత్త పార్టీ పెడతాడని అభిప్రాయపడగా, 24 % (7 గురు) పార్టీ పెట్టాడని అభిప్రాయ పడ్డారు.

చేగువేరా... విప్లవ కెరటం... ప్రపంచ మొదటి మానవుడు

చాలా నిర్లక్ష్యంగా చురుగ్గా వుండే చేగువేరా ఫోటో ని చాలా మంది చూసే వుంటారు. చేగువేరా ఫోటో వున్న టి షర్ట్ చాలా ఫేషనబుల్ గా ధరిస్తూ వుంటారు కాని చేగువేరా గురించి వాళ్ళలో చాలామంది కి తెలెయదు. మీకు చే గురించి తెలుసా ? అర్జంటీనా లో పుట్టి, డాక్టర్ చదువు చదివి క్యూబా విముక్తి పోరాటం లో ఫిదేల్ క్యాస్ట్రో తో పని చేసి, క్యూబా లో మంత్రి గా పని చేసి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించిన చేగువేరా తను నమ్మిన సిద్దాంతానికి, విప్లవ ఉద్యమాలకు ప్రాణం పోసిన మహా వీరుడు. పదవులు తృణ ప్రాయంగా వదిలి పెట్టి బొలివియా విముక్తి పోరాటం చేస్తూ అమెరికా సి ఐ ఎ చేతిలో హత్య కాబడ్డ చేగువేరా ప్రపంచ మొదటి మానవుడని నేను అంటాను. చేగువేరా గురించి మీరు తెలుసుకోవాలనుకొంటే తెలుగు లో 'కాత్యాయిని' వ్రాసిన 'ప్రవహించే ఉత్తేజం చేగువేరా'  పుస్తకం చదవండి (అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ లలో లభిస్తుంది), నిస్వార్ధం గా ప్రజలకు జీవితం అంకితం చేసుకోవడం అంటే ఏమిటో చేగువేరా జీవిత చరిత్ర చదివేతే తెలుస్తుంది, ఎందుకు ప్రపంచ మొదటి మానవుడు అన్నానో మీకు అర్ధం అవుతుంది.

ఆట మొదలు అయింది.... బయ్యారం మునిగింది...

కాంగ్రెస్ పావులు కదపడం మొదలయింది. అంబటి తో మొదటి ఎత్తు వేసిన కాంగ్రెస్ హై కమాండ్ ఇక పట్టు బిగించనుంది. బయ్యారం గనులు లీస్ రద్దు చేయడం ద్వారా జగన్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు పొమ్మనే దాకా పొగ పెడదామనుకొన్న జగన్ ని ఇప్పుడు అధిష్టానం పోయేవరకు పొగ పెట్టె కార్యక్రమం మొదలు పెట్టింది. మొదటి ఎత్తులో అంబటి తో అంబలి త్రాగించి ఇప్పుడు అనిల్ కి నీళ్ళు త్రాగించడం తో జగన్ వర్గానికి పుండు మీద కారం చల్లినట్టు వుంది. జగన్ బయటుకు వెల్లుతూ కాంగ్రెస్ హై కమాండ్ ని దోషి గా నిలబెట్టి ప్రజల సానుభూతి పొందుదామనుకొంటే, కాంగ్రెస్ హై కమాండ్ పార్టీ కి నష్టం లేకుండా జగన్ ని బయటకు పంపే కార్యక్రమం మొదలు పెట్టింది... చూద్దాం.. ఎవరి ఎత్తు ఏమిటో చివరికి ఎవరు చిత్తు అవుతారో....కానీ ఈ ఆటలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే (మహా) నేతలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నంత వరుకు ఎంత దోచుకున్న పర్వాలేదు తేడా వస్తేనే.....

Thursday, July 22, 2010

వేడి తగ్గిన జగన్ ఓదార్పు యాత్ర....

అంబటి రాంబాబు కి  కాంగ్రెస్ హై కమాండ్ అంబలి త్రాగించాక... జగన్ వర్గం చాలా వరకు డీలా పడిందనేది పరిశీలకుల అంచనా. తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహంగా పర్యటన మొదలు పెట్టిన జగన్ కు ఆ జిల్లా మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో పాటు శాసన సభ్యులు తోడ్పాటు లభించడంతో మరింత గా దూసుకు వెళ్ళుతున్న సమయంలో అంబటి మీద వేటు పెడిన తరువాత సంకేతాన్ని  గ్రహించిన శాసన సభ్యులు, మంత్రి గారు ప్రక్కకు తప్పుకొన్నారు. మరో వైపు నుండి బబ్లి వివాదం, తెలంగాణాలో ఎన్నికల వలన జగన్ యాత్ర ఫై  ప్రజల దృష్టి కుడా తగ్గింది. ముఖ్యంగా అంబటి మీద చర్యతో ప్రస్తుతం జగన్ వర్గం ఆత్మరక్షణలో పడింది.

Tuesday, July 20, 2010

వెల్డన్ బాబు... మీరు సాధించారు

అనేక మలుపులు తిరిగిన బాబ్లి వ్యవహారం చివరికి అర్దరాత్రి బలవంతంగా ఆకాశ మార్గంలో తెలుగుదేశం బృందాన్ని బలవంతంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ కు పంపడంతో ఒక అంకం ముగిసింది. ఐతే బాబ్లి పోరాటంలో ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులను దొంగలును కొట్టినట్టు కొట్టి పరాభావించడం చాలా దారుణమైన విషయం. తెలుగు ప్రజల మనోభావాలు ఈచర్య వలన బాగా దెబ్బ తిన్నాయి. మూడు పూటలా తిని ఇంటిపట్టున ఉండి ప్రకటనలు ఇచ్చే నాయకులు దీనిని రాజకీయ లబ్ది అంటూ మాటాడడం సరికాదు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబందించిన సమస్య, దెబ్బతిన్న తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు స్పందించవలసి ఉంది. ప్రజలకోసం, రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాటాలు సాగించే పార్టీలకు ప్రజల మద్దతు ఎప్పుడు వుంటుంది. రాజకీయ లబ్ది అనేది ఈ పోరాటాలలో అంతర్భాగమే, అందులో తప్పు ఏమిటి ?
ఈ విషయం లో కొన్ని చానల్స్ ప్రసారాలు చాలా దారుణంగా వున్నై. ఏది ఏమైనా బాబ్లి ని జాతీయ స్థాయిలో చర్చలో నిలపడం ద్వారా చంద్ర బాబు విజయం సాధించారు. మహారాష్ట్ర సాగించిన దారునమిన ఆకృత్యాలను ఖండిస్తున్నాను. బాబు పరివారానికి నా శుభాకాంక్షలు, వారందరూ త్వరగా కోలుకోవాలని తెలుగు ప్రజలందరి తరుపునా నా ప్రార్ధన.

లోక్ సత్తా వర్కింగ్ ప్రెసిడెంట్ గా డి వి వి ఎస్ వర్మ

కొత్త రాజకీయం నినాదం తో రాజకీయ పార్టీ గా ఆవిర్భవించిన లోక్ సత్తా రాజకీయాలలో పేరుకుపోఇన చెడు సంప్రదాయాలను మార్చడానికి జయప్రకాశ్ నారాయణ గారి అధ్వర్యంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పార్టీ ని నిర్మించుకొంటూ ముందుకు పోతుంది. ఎన్నికలలో అభ్యర్దులు డబ్బు, మద్యం పంచడానికి వ్యతిరేకంగా లోక్ సత్తా వుధ్యమిస్తున్నది. ఎన్నికలలో ప్రలోభాలకు గురిచేయకుదని అందుకు అన్ని పార్టీ లో ముందుకు రావాలని జె పి గారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా, ప్రధాన పార్టీల స్పందన శూన్యం.లోక్ సత్తా చదువుకొన్న వారి పార్టీ అని, పట్టాన ప్రాంతాలకే పరిమితమిన పార్టీ అని కొన్ని విమర్శలు వున్నా, పల్లెతూరులలో కుడా తన శాఖలను విస్తరించుకొంటు పార్టీ ముందుకు పోతుంది.
ఈనెల రెండవ తారీకున లోక్ సత్తా వర్కింగ్ ప్రెసిడెంట్ గా డి వి వి ఎస్ వర్మ గారిని జె పి గారు నియమించారు. వర్మ గారు చాలా కాలం నుండి లోక్ సత్తాలో పని చేస్తున్నారు. అంతకు ముందు ఆయన దశాబ్దాల పాటు కమూనిస్ట్ పార్టీ (సిపిఐ) లో పచ్చిమ గోదావరి జిల్లా లో పని చేసారు. ఆయనను గతం లో కొన్ని సార్లు కలిసి వున్నాను. నాకు తెలిసి మంచి విషయ పరిజ్ఞానం వున్నా నాయకులలో ఆయన ఒకరు. ఈ సందర్బం గా ఆయనకు నా సుభాకాంక్షలు తెలెయ చేస్తున్నాను.

Monday, July 19, 2010

ఈ వంశాల గోడవేందో....

రాజులూ పోయారు, రాజ్యాలు పోయి చాలా దశాబ్దాలు దాటింది, వాటితో పాటే వంశాలు, బేషజాలు కనుమరుగు అయ్యి చాలాకాలం ఐంది. ఐతే ఈ మధ్య కొంతమంది సినిమా అక్టర్లు & పార్ట్ టైం రాజకీయ నాయకులుగా వున్న వ్యక్తులు మీము పలానా వంశం వాళ్ళమని, మాకు మాత్రమే కొన్ని ప్రత్యేక లక్షణాలు / అధికారాలు వున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం ఇరవయ్యో శతాబ్దంలో బ్రతుకుతున్నామని, మనుషులను వాళ్ళ గుణగనాలు ఆదారంగానే ప్రజలు గుర్తిస్తారని సదరు వ్యక్తులు గుర్తించి మసలుకోడం మంచిది.

Sunday, July 18, 2010

చెప్పుకోండి చూద్దాం.....మీ జిల్లా పేరు ఏంటో...

ఎప్పుడో 'రంగా రెడ్డి' , 'ప్రకాశం' జిల్లాల తరువాత మళ్లీ రాజకీయ నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టడం కనిపించలేదు. నెల్లూరు జిల్లాని మాత్రం 'పొట్టి శ్రీరాములు నెల్లూరు' గా మార్చారు (ఈ విష్యం ఇప్పటికి చాలా మందికి తెలెయదు !!). ఇప్పుడు మళ్లీ 'వై ఎస్ ఆర్ జిల్లా' గా కడప పేరు మార్చారు. ఈ సంస్కృతి ఏమిటో అర్ధం కావటం లేదు. ఇక జిల్లాలకు వరుసగా రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకుంటూ పోతారేమో. ఒక జిల్లాకి ఒకిరికన్నా ఎక్కువ నాయకులు పోటిపడితే చీటీలు వేసి నిర్ణయం చేస్తారేమో!!!. నా అభిప్రాయం ప్రకారం భవిష్యత్తు లో చిత్తూరు ని చంద్ర బాబు నాయుడు జిల్లా గా , యెప్పటికైనా కృష్ణా జిల్లా ని యన్ టి రామ రావు జిల్లాగా మారుస్తారని నా అభిప్రాయం. మరి మీ జిల్లా పేరు ఎలా మార వచ్చు ? మిగిలిన జిల్లాలకు మీ పేర్లు కామెంట్స్ లో చెప్పండి (అక్టోపాస్ పాల్ గాడు చెప్పగా లేంది, మనం భవిషత్తు గురించి చెప్పలేమా!!!)

Saturday, July 17, 2010

హలో... బ్రదరూ... అనిలూ

అత్త సొమ్ము అల్లుడు దానమిచ్చాడని తెలుగు లో ఒక వ్యావహారికం వుంది, ఇప్పుడు దానిని ప్రజల ఆస్తి అల్లుడికి దానం చేసిన మామ అని మార్చుకోవాలేమో!!. మహా నేత అని ఉదరగొట్ట బడుతున్న వై యస్ ఆర్ జమానాలో జరిగిన అవినీతికి తాజాగా వెలుగులోకి వచ్చిన విష్యం పరాకాష్ట గా చెప్పుకోవచ్చు.
అల్లుడు అనిలు బుద్ధిమంతుడు, దైవచింతన కలవాడు, దేవుని ప్రియ పుత్రుడు గా తలచిన ఏలిన వారు కేవలం 56000 హెక్టారుల ( దాదాపు 140000 ఎకరాలు ) ఇనుప గనులను ఆయన పరం చేసారు. కనీసం ఇంకా ప్రారంభం కాని కంపెనీకి ఇన్ని ఎకరాలు ధారాదత్తం చేయడం మహా నేత కే చెల్లింది. నేను గతంలో పనిచేసిన కంపనీలో నా బాస్ ఒక మాట అంటుండేవారు "వ్యక్తులను మోసం చేయకూడదు కాని వ్యవస్థ ని మోసం చేసుకోవచ్చు". మహా నేత అభిప్రాయం కుడా అదేనని ఈ సంఘటన ద్వార నాకు అని పిస్తుంది. అసలు ఆ ఎకరాల సంఖ్యను వింటుంటేనే గుండె చెదిరి పోతుంది.. దీని ముందు బ్రహ్మణి, గాలి గారి గనులు దిగదుడుపే. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఒక్క ఎకరం కుడా కేటాయించ లేదు గాని అల్లుడు గారికి మాత్రం ముందుచూపుతో కేటాయించేసారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన ప్రజలు తన దాకా వచ్చేవరకు సమాజం తగాలబదిపోతున్నా పట్టించుకోరు, మన మహా నేత ఈ విష్యం బాగా అర్ధం చేసుకొని చెలరేగి పోయారు, ఆయనను పాపం ప్రితిపక్షాలు దిగ్బ్రాంతి తో చూస్తు ఉండిపోయాయి.
మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు, ఐతే ముర్ఖుడే రాజు ఐతే ? నేనంటాను ఆతను మహా నేత అవుతాడని. మరి మీరేమంటారు? మీ అభిప్రావయాన్ని క్రింద కామెంట్లో తెలియచేయండి

బాబ్లి...బాబ్లి.. ఓ బాబ్లి

ప్రస్తుతం మీడియా కు చాలా మేత దొరుకుతుంది. ఓ ప్రక్క జగన్ పర్యటనలు, సోంపేట కాల్పులు, టి టి డి గొడవలు, క్రొత్తగా ఇప్పుడు బాబ్లి గొడవ..... మనవాళ్ళు వట్టి వెధవలొఇ అంటాడు గిరీశం ఒక సందర్భంలో (కన్యాశుల్కం నాటకం లో). ఆ మాట మన రాజకీయ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. మనవాళ్ళు చేతులు కాలాకా ఆకులు పట్టుకునే రకం. ఎంత అవినీతి వున్నా తమ రాష్ట్ర ప్రయోజనాలను చుట్టూ వున్న రాష్ట్రాలు కాపాడుకొంటుంటే మనవాళ్ళు కనీసం ఆపని కుడా చేయలేక పోతున్నారు.ఇక మనం నష్ట పోఇనా మరో ప్రాంతం (ఇండియా లో ) బాగు పడుతుంది కదా అని సంతోషించాలేమో. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి మనం కూడా జాతీయ స్థాయిలో ఆలోచించాలేమో!!.
కారణాలు ఏమితేనేమి మన సి బి నాయుడు గారు కదిలారు. పాపం కనీసం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి, నేషనల్ ఫ్రంట్ లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి అని కూడా చూడకుండా వాళ్ళు తీసుకెళ్ళి జైలు లో పెట్టేసారు. సరైన ఫుడ్, బెడ్డు లేకుండా అందరితో కలిపి ఒకచోట పెట్టేసారు. మన బాబు గారు చాలా మొండి వ్యక్తి కనుక బెయిల్ నిరాకరించి జైలుకి వెళ్లారు (వెళతారని వార్త). ఈ సింపతి మీద తెలంగాణాలో ఏమైనా సీట్స్ గెలేస్తే బాబు గారికి అంతే చాలు. ఐతే అలిపిరి బ్లాస్ట్ తరువాత సింపతిని నమ్ముకొని దెబ్బ తిన్న చరిత్ర మరో సారి రిపీట్ ఐతే.....
సరే రాజకీయాలు ఎలా వున్నా ఈ విషయంలో బాబు ని అభినందిన్చవలసిందే, ఎందుకంటే బబ్లి విషయాన్ని ఏదోవిధంగా దేశవ్యాప్తం గా వార్తలలో నిలపగాలిగారు. మరో ముఖ్యమైన విష్యం ఏమిటంటే మహారాష్ట్ర సి యం ఈ విషయంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలకు లోబడి ఉంటామని ప్రకటించడం, ఇవి బాబు సాధించిన విజయాలుగానే చెప్పుకోవాలి.

కారంచేడు కి 25 ఏళ్ళు ....

సరిగ్గా ఇదేరోజు 25 సంవత్సరాల క్రితం 1985 లొ నరమేధం జరిగింది. అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్నాను. చాలా రోజులు అన్దోనలు జరిగాయి, మా స్కూల్ చాలా రోజులు మూసేసారు. అప్పటి వాతావరణంలో అగ్రవర్ణాల వారు, దళితులు రెండు వర్గాలుగా విడిపోయారు. నాకు బాగా గుర్తు, స్కూల్ మూఇంచడానికి దళితులూ స్కూల్ కి వచ్చినప్పడు మీము వ్యతిరేకిన్చాం. అప్పట్లో నాకు ఈసంఘటన గురించి వాస్తవ పరిస్థితి తెలియదు. ఈ సంఘటన వెనుక వున్న దగ్గుబాటి చెంచురామయ్య (దగ్గుబాటి వెంకటేశ్వర రావు తండ్రి) ను తరువాత నక్సల్స్ కాల్చి చంపారు. అప్పటి సంఘటనలో 5 హత్యకు గురి అవ్వగా వందలాది మంది దళితులూ గాయపడ్డారు. ఈ సంఘటన అప్పటి ముఖ్యమంత్రి యన్ టి రామరావు కి ఒక మచ్చ గా మిగిలి పోయింది. ఈ సంఘటన తరువాత 23 సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తిగాని భాదితులకు న్యాయం దక్కలేదు.

25 సంవత్సరాల తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? ఏమీ మారలేదు అప్పడు అగ్రవర్ణాలు దోచుకుంటే, ఇప్పుడు స్వయంగా ప్రభుత్యాలే పేదలను, నిమ్నవర్గాల వారిని దోచుకు తింటున్నాయి. మొన్నటికి మొన్న సోంపేట లొ జరిగిన లైసెన్సడు కిల్లింగ్స్ దీనికి సాక్ష్యం.

Friday, July 16, 2010

సోంపేట పాపం ఎవరిది ?

చరిత్రలో మరో దురాక్రమణ పదఘట్టనల క్రింద మరో రెండు పేద బ్రతుకులు రాలిపోయాయి. దేశాన్ని దోచుకుతినే రాజకీయ నాయకులు, అవినీతి అదికారుల సాక్షిగా బక్క ప్రాణుల రక్తం చిందింది. సరైన తిండి, బట్ట, గూడు లేనివాళ్ళకు కనీసం మంచి గాలిని అన్నా వదలాలని ఏవొక్క రాజకీయ నాయకుడు ఆలోచించలేదు. వెలది ఎకరాలు వ్యాపారులకు ధారాబెట్టి, పేద ప్రజల పొట్ట కొట్టి ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది ? ఇద్దరు చనిపోయాకగాని పర్యావరణ అనుమతులు నిరాకరించడం ఏమిటి ? ముందు ఏమైంది ఈ తెలివి?. అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారంటున్నారు, వాళ్ళ మీద ఏమి చర్యలు తెసుకొంటారు ?. రాష్టంలో విధ్యుత్ అవసరం చాల వుంది, అందుకని వేలాది ప్రజల పేద ప్రజల జీవనోపాధి మీద దెబ్బ కొడతార ? అసలు ఆరు థెర్మల్ విధ్యుత్ కేంద్రాలకు ఒక్క శ్రీకాకుళం లోనే అనుమతి ఇవ్వడం ఏమిటి ? మరింత ఘోరమైన విషయం ఏమిటంటే ఈ కేంద్రాలలో ఉత్పత్తి చేసే కరెంటు మాత్రం మనకు వుండదు. ఏదో కొంచెం మనకు విదిల్చి మిగిలింది వాళ్ళు బయట అమ్ముకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్ట్స్ ను మరోసారి సమీక్ష చేయవలసిన అవసరం వుంది లేదంటే ఇటువంటి సంఘటనలు మళ్ళి మళ్ళి పునరావృతం అవుతాయి. ప్రస్తుత సంఘటనకు కారణమైన వారిని కటినం గా శిక్షించాలి. సోంపేట, పరిసర గ్రామాల ప్రజలకు నా ప్రఘాడ సానుభూతి తెలెయచేస్తున్నాను.

జగన్ ... జగన్... జగనోమియా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాంచి వేడి మీద వున్నాయి. సోంపేటలో కాల్పులు వల్ల రెండు రోజుల నుండి కొంచెం ద్రుస్టి కొంచెం అటుమల్లినా చానల్స్, పేపర్స్ జగన్ యాత్ర గురించి విపరీతం గా ప్రచారం చేస్తున్నై. ఇక సాక్షి చానెల్ లో ఐతే జగన్ అడుగు తీసి అడుగు వేస్తే న్యూస్ ఐనట్టు ప్రసారాలు జరుగుతున్నాయి. సాక్షి చానెల్ ఇదివరకు చేసేవాడిని కాని ఇప్పుడు ఆ చానెల్ అంటే రోత పుడుతుంది. ఎంత సొంత చానెల్ ఐతే మాత్రం ఇంత సొంత డబ్బా అవసరమా?
వయసులో చిన్నవాడు ఐనా జగన్ రాజకీయ ఎత్తుగడలు నిజంగా అధ్బుతం. పావురాల గుట్ట వద్ద మీటింగ్లో ఇంటింటికీ వస్తానని అన్నప్పుడే నాకు జగన్ రాజకీయ ఎత్తుగడ బాగా నచ్చింది. ఎంత ముందుచూపుతో ఆ మాట వదిలాడో అప్పుడే పసిగట్టా, ప్రస్తుతం జగన్ చేస్తున్న పని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విత్తనాలను చల్లడం (అంటే తనను గుడ్డిగా నమ్మేవాళ్ళను తాయారు చేసుకోడం) అది కూడా అధిక సంఖ్యలో వుండే పేదవారిని టార్గెట్ గా చేసుకోడం, వాళ్ళలో బాగా కృతజ్ఞతా భావం కల్పించడం, వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి విగ్రహాలు వురూర నెలకొల్పడం ఇవన్ని చాల పక్కగా వేసుకొన్న ప్రణాళిక. నా ఉద్దేశ్యం ప్రకారం జగన్ క్రొత్త రాజకీయ పార్టీ నిర్ణయం ఎప్పుడో ఇపాయింది. అది కాంగ్రెస్-ఆర్ కావచ్చు లేదా కాంగ్రెస్-వై ఎస్ ఆర్ కావచు లేదా 'రాజశేఖర్ రెడ్డి' కావచ్చు.

చూద్దాం ఏమి అవుతుందో.... జగన్ రాజకీయ దృష్టికి మాత్రం నా జోహార్లు

ముందుగా మన వార్త పత్రికలూ , న్యూస్ చానల్స్ ...

చాల విచారకరమిన విషయం ఏమిటంటే ఫోర్త్ ఎస్టేట్ గా భావించబడే మీడియా ఈ రోజు కొన్ని వర్గాలకు కొమ్ము కాసేవిగా తయారవ్వడం. తమిళనాడు తెసుకొంటే జయ చానెల్ , సన్ చానల్స్ ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఛానల్,న్యూస్ పేపర్స్ వారి వారి ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు ప్రచారం చేసుకోడానికి ప్రారంభం అయ్యాయి. ఈనాడు పేపర్ కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం కు మద్దతు లోపాయకారిగా మద్దతు ప్రకటిస్తుంది. ఈ పేపర్స్ చదివి, చానల్స్ చూసి మధ్యలో పూల్స్ అయ్యేది మనం. ప్రజలకు నిజాలు తెలేయచేయవలసిన మీడియా ఈవిధంగా రాజకీయ పార్టీలకు , వ్యాపారవేత్తలకు తొత్తులుగా మారడం వల్ల సమాజం ఎంతగానో నష్టపోతుంది. నిజం , న్యాయం అనే మాటలకు ప్రస్తుతం మీడియా ఉప్పు పాతర వేసింది. బయటకు కనిపించని ఒక మహా యుద్ధం మీడియాలో ప్రస్తుతం జరుగుతుంది అది ప్రజల మెదళ్లని వారి వశం చేసుకోడానికి సర్వశక్తులు వడ్డుతున్నారు.
ఈ దుర్గతి నుండి మీడియా ఎప్పటికైనా బయటపడుతుందా?

ఈ బ్లాగు గురించి కొంచెం ......

నేను ఈ బ్లాగుని మొదలు పెట్టాలని ఎప్పటినుండో అనుకొని, రిజర్వు చేసుకొని ఒక సంవత్సరం ఐంది. కానీ అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కుడా ఉంచలేక పోయాను. ఐతే ఈమధ్య జరుగుతున్న రాజకీయ మార్పులు చూసిన తరువాత నా అభిప్రాయాలను మీతో పంచుకోకుండా వుందా లేక పోతున్నాను.

ఈ బ్లాగు విసిట్ చేసేవారికి నా గౌరవ విన్నపం ఏమిటంటే, దయచేసి నీను ఒక పార్టికి చెందిన వాడిగా భావించవద్దు. ఈ అభిప్రాయాలూ పూర్తిగా నా వ్యక్తిగతమినవి, మీరు ఆమోదించవచ్చు లేదా వ్యతిరేకించ వచ్చు కానీ నేను ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వార్తా పత్రికలో వచ్చిన కధనాల ఆధారంగా నా అభిప్రాయాలను తెలేయపరుస్తాను.