Tuesday, September 28, 2010
చిరంజీవి, సోనియా రహస్య చర్చలు....
గత పోస్ట్ 'రసకందాయం లో రాష్ట్ర రాజకీయం' లో చిరంజీవి, కాంగ్రెస్ ల మధ్య వచ్చే ఎన్నికలనాటికి అవగాహన కుదురుతుందని వ్రాసా ఐతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చిరంజీవి, కాంగ్రెస్ ల మధ్య దూరం మరింత తరిగి పోయినట్టుకనిపిస్తుంది. చిరంజీవి రహస్యం గా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ తో సమావేశం ఐనట్టు వార్తలు వచ్చాయి. తొందరలోనే ప్ర రా పా ప్రభుత్వం లో చేరి కొన్ని మంత్రి పదవులను దక్కించుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. జగన్ ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ చురుగ్గా పావులు కదుపుతుంది... మరి కొన్ని నెలలలో రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య మైన మార్పులు చోటుచేసుకొనే అవకాశం వుంది.
పోల్ రిసల్ట్ - వచ్చే ఎన్నికల నాటికి 'ప్రజా రాజ్యం' కాంగ్రెస్ లో విలీనం అవుతుందా ?
Saturday, September 25, 2010
రసకందాయం లో రాష్ట్ర రాజకీయం


జగన్ కొత్తపార్టీ పెట్టబోతున్నట్టు దాదాపుగా ఖరారు ఐంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు నియోజకవర్గ శాసనసభ్యులు దూరంగా వుండగా జగన్ సొంత టీవీ చానెల్ లో యాత్ర గురించి వుదరగోడుతూ మధ్య మధ్యలో ‘కనబడుటలేదు- స్థానిక నియోజకవర్గ శాసన సభ్యులు’ అంటూ ప్రకటనలు ఇవ్వడంతోనే అర్ధం అవతుంది జగన్ కి కావలసింది ఏమిటో. ఒకప్రక్క ఈ యాత్ర వ్యక్తిగతం అంటూనే మరో ప్రక్క ఇటువంటి ప్రకటనలు ఇవ్వడంలోనే జగన్ అంతరార్ధం స్ఫష్టం గా అర్ధం అవుతుంది. ఈ వోదర్పు యాత్ర మరో ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాలు పాటు జరుగుతుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు (అంటే మరో రెండు సంవత్సరాలు సాక్షి టీవీ చూడనక్కరలేదు), జగన్ ప్రణాళిక పక్క వ్యూహం తో ముందుకు వెళుతున్నాడు. కాంగ్రెస్ కి సంప్రదాయ ఓటు బ్యాంకు క్రింద వున్న దళితులను తనవైపు తిప్పుకోడం (దీనికోసం క్రిస్టియన్ చర్చి లను బాగా వుపయోగిన్చుకొంటున్నారు), కాంగ్రెస్ కేడర్ వుపయోగించుకొని బలపడి చివరికి వేటు వేఇంచుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టడం (కాంగ్రెస్ –ఆర్ కావచ్చు) ఇదీ జరగబోయే పరిణామం.ఇక కాంగ్రెస్ కి కష్ట కాలమే!! దానికి వున్న దారులు రెండే... ఒకటి జగన్ తో సర్దుకుపోఇ వచ్చే ఎలక్షన్ లలో ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించడం, లేదు అంటే సాధ్యమైనంత తక్కువ నష్టం తో జగన్ ని బయటకు పంపించి చిరంజీవికి రెడ్ కార్పెట్ వేయడం. ప్రస్తుతం కాంగ్రెస్ లో జనాకర్షణ వున్న నాయకులు ఎవరూ లేరు, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వై ఎస్ ఆర్ జపం చేయక తప్పదు, జగన్ ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కి చిరంజీవి తప్ప మరో మార్గం లేదు, ఐతే చిరంజీవి కి ముఖ్యమంత్రి అభ్యర్ధి గా ముందుగా ప్రకటించక పోవచ్చు కాని ప్ర.రా.ప ని కాంగ్రెస్ లో కలపడం ద్వారా కాంగ్రెస్ లో చిరంజీవికి సముచిత స్థానం దొరుకుతుందనటం లో సందేహం లేదు, మొత్తానికి చిరంజీవి ‘జాక్ పాట్’ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది......
Tuesday, September 21, 2010
చంద్ర బాబు X రాజశేఖర రెడ్డి
పరస్పర వ్యతిరేఖ లక్షణాలు వున్న ఇద్దరు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లో అత్త్యున్నత స్థానాన్ని అలంకరించడం మనం చంద్రబాబు, రాజశేఖర రెడ్డి ల రూపం లో చూడవచ్చు. ఐతే ఇద్దరిలోనూ కామనగా వున్న ఒక లక్షణం ‘అవినీతి’.
అవినీతి కి తలుపులు బార్లా తెరిచిన వ్యక్తి చంద్రబాబే. రామారావు అధికారంలో వుండగా ఆర్ధిక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు అత్యంత అవినీతి పరుడిగా చెప్పు కోవడం నాకు ఇంకా గుర్తు వుంది (అప్పట్లో నీను హై స్కూల్ చదువుతున్నా). యన్ టి రామా రావు ని పడగొట్టి మొదటి సారిగా సెప్టెంబర్ 1, 1995 న ముఖ్యమంత్రి గా గద్దినెక్కిన తరువాత ఆయన అవలంభించిన అవినీతి విధానాలే రాజశేఖరుడు మరిన్ని రెట్లు ముందుకు తీసుకుపోయాడు.
చంద్రబాబు మీద ముఖ్యంగా వున్న ఆరోపణలలో ఆయన దొంగడబ్బు తరలించి సింగపూర్ లో హోటల్స్ లో పెట్టుబడి పెట్టాడని, ఐతే ఇప్పటివరకు దీనిమీద సరిఐన ఆధారాలు చూపిన వారు ఎవరూ లేరు (మీలో ఎవిరికైనా తెలిసి వుంటే, కామెంట్ లో తెలియచేయండి). చంద్రబాబు కు సత్యం కు వున్న లింకు మాత్రం కచ్చితంగా ఆయన అవినీతిని తెలియచేసేదే. అలాగే అయన హేరిటేజ్ భూముల కుంభకోణం గురించి కుడా నమ్మదగిన ఆధారాలు వున్నాయి. ఎస్ ఇ జడ్ లు పేరిట డెవలప్ చేసిన ప్రాంతాల లో ముందుగానే భూములు కొని ఆస్తులు పెంచుకోన్నట్టు కుడా ఆరోపణలు వున్నాయి, బిల్లీ రావు తో ఆయన సంబంధాలు ప్రశ్నించదగ్గవే. చాలా మంది నమ్మకం ఏమిటంటే ఆయన అక్రమ సంపాదన అంతా రామోజీ రావు ద్వారా చలామణీ అవుతుందని, కానీ ఎవరూ ఇప్పటివరకూ నిర్దిష్టమైన ఆధారాలను చూపలేదు. ముఖ్యం గా ఆయన కు అంటుకొన్న అతిపెద్ద అవినీతి మరక రిలయన్స్ కి కె జి బేసిన్ లో ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి వారివద్ద నుండి పెద్దమొత్తంలో దండుకోన్నరనేది (Check in Wiki).
ఎన్నికలలో ధన ప్రవాహం, విచ్చలవిడితనం చంద్రబాబుతోనే మొదలు అయ్యాఇ. ప్రకటన పేరుతో ప్రజా ధనాని దుర్వినియోగ పరచడం కుడా ఆయనతోనే మొదలు, రాజశేఖరుడు దానిని 100 రెట్లు పెంచాడు. హై టెక్కు ముఖ్యమంత్రి గా, రాష్ట్రానికి సి ఈ ఓ గా పేరుగడించినా రైతులను చిన్నచూపు చూపు చూసి, పల్లె ప్రజలు, రైతుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా ఆయన చెప్పట్టిన చర్యలు ఎక్కువమందికి ఆమోదయోగ్యం కాలేదు. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్టుమెంటు ఈయన కాలంలో పడుకుందని చెప్పాలి, కొత్తగా కట్టిన ప్రాజక్టు కాని, రైతులకు వుపయోగపడే ఒక్క స్కీం గాని ఈయన పాలనలో వచ్చింది లేదు. ఒక్క వుదాహరణ చెప్పాలంటే ఒరిస్సా బోర్డర్లో వున్న ‘జంజావతి’ ప్రాజెక్ట్ యన్ టి రామా రావు హయం లో మొదలై రిజర్వాయర్ పూర్తి కావచ్చిన దశలో ఒరిస్సా తో వున్న చిన్న చిన్న అభ్యంతరాలు వాళ్ళ ఆ ప్రాజక్టు ఆగిపాయింది. అక్కడ వున్న వుద్యోగులందరికీ సంవత్సరాల తరబడి (వాళ్ళకి ఒక కాలని వుంది) వట్టినే కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు కాని చిన్న పని కుడా ముందుకు పోలేదు చంద్రబాబు హయంలో. అక్కడ వున్న యంత్రాలు అన్నీ తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. హైటెక్కు ముఖ్యమంత్రిగా చెప్పబడే బాబు దాని వంక చుస్తే ఒట్టు. చివరికి రాజశేఖర రెడ్డి బెల్జియం నుండి రబ్బరు డ్యాం తెప్పించి దానిని వుపయోగంలోకి తీసుకు రావలసి వచ్చింది. అప్పటివరకు పంటలు లేక 30, 40 వేల మధ్య వున్నా పొలాలు ఇప్పుడు దాదాపు 2 లక్షలు పలుకుతున్నాయి (నేను ప్రత్యక్ష్యంగా పార్వతీపురం, జంజావతి ప్రాజక్టు కు వెళ్లి చూసి వచ్చా). నేను ఈ వుదాహరణ ఎందుకు చెబుతున్నానంటే బాబు హయంలో ఇరిగేషన్, వ్యయసాయం ఎంత వుదాసీనతకు గురి అయ్యాయో తెలియచేయడమే.
చంద్రబాబు/ రాజశేఖర రెడ్డి కొన్ని విషయాలలో అసలు పోలిక వుండదు-
బాబు ఎవ్వర్నీ నమ్మడు (తన నీదని కుడా) / వై ఎస్ ఆర్ నమ్మిన వాళ్ళను వదలడు
బాబు కుడా వుండేవాడు మీద మచ్చాపడితే వెంటనే వదిలేస్తాడు / వై ఎస్ ఆర్ వాళ్ళ కొమ్ము కాస్తాడు – ఇది మంచి లక్షనం గా కనిపించవచ్చు కానీ బాబు విధానమే కరెక్ట్.
బాబు కి రోడ్స్ బాగా వుండాలి / వై ఎస్ ఆర్ కి కాలవలు, ఇరిగేషన్ బాగుండాలి
బాబు కి మీడియా అంటే భయం, గౌరవం / వై ఎస్ ఆర్ కి మీడియా అంటే భయం, గౌరవం లేవు
కానీ ఇద్దరిలోనూ కామన్గా వున్న లక్షణం అవినీతి. కాకపొతే వై ఎస్ ఆర్ కన్నా కొంచెం తక్కువ అంతే. ఇద్దరికీ ప్రజాస్వామ్య పద్దతులు మీద నమ్మకం లేదు, ఎన్నికలు అంటే డబ్బులు పంచడం, సారా పంచడం, ప్రజలను మభ్యపెట్టి గెలవడం. మళ్ళీ ఈ డబ్బును ప్రజల నుండే దోచుకోవడం. ఈ విషయంలో ‘లోక్ సత్తా’ పార్టీ రాజకీయ పార్టీ లను ఎలక్షన్ లలో డబ్బు, సారా పంచడం చేయకూడదని, దానికి బహిరంగంగా ప్రమాణం చేయాలని కోరితే ఇటు టి డి పి గాని , అటు కాంగ్రెస్స్ కాని విననట్టే వున్నాయి.
పోల్ రిసల్ట్ - రాజశేఖర రెడ్డి / జగన్ రూ .1,00,000 కోట్లు అక్రమ ఆస్తులు కూడపెట్టారన్న ఆరోపణలను మీరు నమ్ముతున్నారా ?
ఈ పోల్ లో 77 మంది పాల్గొన్నారు.
అవును అని సమాదానమిచ్చినవారు - 67 మంది (87%)
కాదు అని సమాదానమిచ్చినవారు - 10 మంది (12%)
ఈ పోల్ వల్ల విద్యాధికులు లో (కనీసం ఇంటర్నెట్ వాడడం తెలిసిన వారు) ఎక్కువ శాతం రాజశేఖరరెడ్డి/జగన్ లఫై వచ్చిన ఆరోపణలు నమ్ముతున్నారని నేను భావిస్తున్నాను. ఐతే చదువు లేని వారు, స్వప్రయోజనాలను ఆశించి కూడా వుండేవారి అభిప్రాయం ఇదేవిధంగా వుంటుందని చెప్పలేం
Thursday, September 16, 2010
అవును... దోచుకోవడం వారి కుటుంబ వ్యాపారం.
రెండు రోజుల క్రితం ఈనాడు సంచలనాత్మక కధనం (సరస్వతి ఇండస్ట్రీస్) తో ఖంగుతిన్న జగన్ వర్గం ఎదురు దాడికి దిగింది. ఎ పి ఐ ఐ సి లో అధికారం వెలగబెట్టి కోట్లాది రూపాయలు బొక్కిన అంబటి రాంబాబు గనులు త్రవ్వుకోవడం వై ఎస్ ఆర్ కుటుంబ వ్యాపారమని నిజం చెప్పాడు . ఐతే రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నా వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి సొంత ఆస్తులు పెంచుకోవడం కరక్టేనా?. పులి గడ్డి తింటుoదా , ఫ్యాక్షనిస్టు ప్రజా ప్రయోజనాలను పట్టించుకొంటాడా ?. వై ఎస్ ఆర్ తండ్రి రాజా రెడ్డి ఎంతో మంది రక్తం కళ్ళ చూసి గనులు, భూములు ఆక్రమించుకొని ఫ్యాక్షన్ నాయకుడుగా వెలుగొంది ఆ ఫ్యాక్షన్ లోనే అంతమవగా ఆయన కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివిన వై ఎస్ ఆర్ ‘క్రోనీ కేపటలిస్ట్’ గా (అధికారం అడ్డం పెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోనేవాడు – క్రోనీ కేపటలిస్టు) ఇబ్బుడి, ముబ్బిడి గా ఆస్తులు పెంచుకొన్నారు. ఈ వై ఎస్ ఆర్, గాలి జనార్ధన రెడ్డి, జగన్ లాంటి వాళ్ళు నమ్మేది ఒకటే సిద్దాంతం ‘ప్రతి మనిషికి ఒక రేటువుంటుంది’, వీళ్ళు చేసే పని బాగా డబ్బు పోగేయ్యడం ఆ డబ్బునే వెదజల్లి అక్రమంగా మరింత డబ్బు సంపాదించడం, అధికారంలోకి వచ్చి ఎదురులేకుండా చేసుకొని ఎదేచ్చాగా దోచుకోవడం. ఈ విష వలయం ఇలా సాగుతూ వుంటుంది.
రైతు భాంధవుడు గా, మహా నాయకుడు గా చెప్ప బడుతున్న వై ఎస్ ఆర్, బామర్ది కడప మేయర్ రవీంద్ర రెడ్డి అక్రమంగా వేల టన్నుల ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకొంటూ (దానిలోనూ కల్తీ చేస్తూ) రైతుల పొట్ట కొడుతుంటే వై ఎస్ ఆర్ ఏమిచేసాడు? పైగా రాయలసీమ సరిపోఇనట్టు లేదు...పచ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు లో ఎరువుల కర్మాగం పేరుతో (వీళ్ళు ఏదీ ప్రొడక్షన్ చేయరు, అన్నీ కలిపి ఒక పేరుపెట్టి అమ్ముకొంటారు, పైగా కల్తీ చేసి ఎక్కువ ధరకు) దందా చేయబొఇ ప్రతిఘటన రావడంతో వెనక్కు తగ్గాడు (వై ఎస్ ఆర్ బ్రతికి వుంటే మళ్ళి వచ్చేవాడేమో ?). ఈ మధ్య జరిగిన విజిలెన్స్ దాడులలో బాగోతం బయటపడింది, ఐనా చిన్న చిన్న వుద్యోగులపైనే తప్ప ఎవరిమీదా చర్యలు లేవు.
Wednesday, September 15, 2010
ఎంత అమానుషం ...
కొంచెం సేపు రాజకీయాలను పక్కన పెట్టి చుట్టూ జరిగే సంఘటనలు చూస్తుంటే మనం ఎక్కడ వున్నామా అనిపిస్తుంది. నిన్న నెల్లూరు లో 6 సంవత్సరాల ముక్కుపచ్చలారని పాప ని కన్న తల్లి (టీచర్ ), ప్రియుడు పెట్టిన చిత్రహింస చుస్తే కన్నీళ్లు ఆగలేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు లివర్ కూడా దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్ ఐనదంటే ఎంత చిత్ర హింస పెట్టివుంటారో వూహించుకోవచ్చు. ఐనా ఆ పాప (నర్తన) 'అమ్మా' అని ఏడుస్తుంటే చూసిన వారికి గుండెలు పిండినట్టు వుంది.
చిన్న పిల్లల మీద సెక్స్వల్ , ఫిసికల్ హరస్మేంట్ ఈ మధ్య బాగా పెరిగిపోఇంది , స్కూల్ లో అధ్యాపకులే కామాంధులు గా ప్రవర్తించిన సంఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం జరిగాయి. చిన్న పిల్లల మీద జరిగే అఘాయిత్యాలలో బయటకు తెలిసేవి చాలా తక్కువే. ఇటువంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వం అమెరికా తరహాలో కటినమైన చట్టాలు చేసి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేసి వాటిని విస్తృత ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం వుండవచ్చు.
అందరూ గురువిన్దలే......
కడప ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి రూ 1,00,000 కోట్లు అక్రమంగా కుదబెట్టారని, వాటిపైన విచారణ చేయాలని కోరుతూ తెలుగు దేశం ఆందోళనలు చేపడితే, చంద్రబాబు 2 ఎకరాలనుండి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మొత్తం మీద వాళ్ళు తిన్నారని వీళ్ళు, వీళ్ళు తెన్నారని వాళ్ళు ఆరోపణలు చేసుకొంటూ వుంటే మనం ఇటు అటు తల తిప్పుతూ వుండాలన్నమాట. జగన్ 45 కోట్లు తో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఒక్క బస్తా సిమెంట్ కుడా తయారు కాకుండానే 3050 కోట్లు (ఫిగర్ ఎగ్జాట్ కాక పోవచ్చు ) 50% వాటాని ఎలా అమ్మడాని ఈనాడు లో వస్తే, మధ్యలో దేవందర గౌడ పేరు బయటకు వచ్చింది, ఆయన మ్యాట్రిక్స్ కంపనీలో ౩ కోట్లు పెడితే అది ఇప్పుడు 500 కోట్లు అవ్వగా లేనిది జగన్ కి రాకూడదా అని ఆయన ‘సాక్షి’ లో వార్త. చంద్రబాబు తినలేదని ఎవరూ అనలేరు కాని రాజశేఖర రెడ్డి హయంలో అవినీతి అవినీతిపరులనే విస్మయానికి గురిచేసింది. చీమను చంపినా, ఏనుగును చంపినా ఒకటే అన్న రీతిలో కోటి రూపాయలు అవినీతి ఐనా లక్ష కోట్లు అవినీతి ఐనా ఒక్కటే అన్న రీతిలో ఆయన పాలన సాగింది. ఏది ఏమైనా అవినీతి విషయంలో అందరూ గురువింద గింజలే.
Tuesday, September 14, 2010
పోల్ రిసల్ట్ – తెలంగాణా పరిష్కారానికి ముందుగా హైదరాబాద్ ను పరిష్కరించాలా ?
ఈసారి గతంలో ఎప్పుడూ లేనంత వుత్సాహం గా చాలా మంది పోల్ లో పాల్గొన్నారు. వోటింగ్ సెంచరి దాటి 101 వోట్లు పోల్ అయ్యాఇ. వీటిలో 65% ( 66 మంది) ‘అవును’ అని అభిప్రాయ పడగా, 34% (35)మంది ‘కాదు’ అని అభిప్రాయ పడ్డారు.
Sunday, September 12, 2010
నాకు నచ్చిన రెండు తెలంగాణా కవితలు....
ఈమధ్య అంతర్జాలం లో తిరుగుతుండగా నాకు తెలంగాణా సోదరులు వ్రాసిన రెండు అధ్బుత మైన కవితలు కనిపించాయి. ఒకటి హైదరాబాదు నిజాం కాలంలో అభివృద్ధి చెందినదని అన్న కెసిఆర్ మీద (ఆ విధంగా మాట్లాడిన వారి అందరికి ఇది వర్తిస్తుంది ) ఎక్కుపెట్టగా మరొకటి తెలంగాణా ప్రజల గుండెకోత తెలియచేస్తూ సాగుతుంది. మీరు ఈ పోస్టింగ్స్ ని http://jabilli.wordpress.com/2010/02/10/ అడ్రెస్స్ లో చూడవచ్చు.
కవిత -1
కేసీఆర్ … "నీకు గోరికడతాం కొడక" … నీ (క్రాంతి) – సేకరణ
రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి
కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి,
సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది !
ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల
ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..!
ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి
కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల..
బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం
నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..!
ఈ గద్ద ముక్కొడికి
గెరిల్లా యోధుల గుండె మంటలేం దెల్సు?
అరె.. గుండెలు మండిపోతున్నైరా.. ఎలా తట్టుకునేదీ మాటలు
ముఖ్దూంసాబ్, బద్దం ఎల్లా రెడ్డి, చాకలి అయిలమ్మ, తమ్మారపు గోవిందు
మళ్లీ చంప బడ్డార్రా…. బిడ్డ
వాడిని క్షమించొద్దు..!
నీ "బాన్చనన్నా" బతుకులు కూల్చబడ్డది,
నీ "కాల్మోక్థ" అన్నా చెరచబడ్డ ఆడది
వాడికేం తెల్సు????
పోరాటం కోసం బతుకుని బుల్లెట్లకు దారాబోసినోళ్ళు,
ఆజాదీ కోసం గుండెల్లో గుళ్ల వర్షం కురిపిచ్చుకున్నొళ్ళు,
మాతాత పక్కతెముకలు కుప్ప చేసిన బూట్లదెబ్బలు,
గిరిప్రసాద్ రొమ్ము చీల్చిన బుల్లెట్ సంగతి,
చిట్యాలలో నర మేధం..
వాడికేం తెల్సు???
వోరేయ్ శవ సంభోగి……
నీ మాటలు విన్నాక కాటికి కాల్జాపిన మా జేజి "కాంద్రించి ఉమ్మింది",
"నిజాం (నిరంకుశత్వాన్ని) ని వెయ్యిసార్లు పోగుడ్థా" అన్న నీ ఫోటో ఉన్న పేపర్ మీద
మా పిలగాడు "ఉచ్చ బోస్తన్నాడు"
ఉద్యమ నేత ముసుగ్గప్పుకున్న తాగుబోతొన్ని, బుధ్ధిహీనున్ని,
మా గుండెల మీద తీవ్రంగా ఎగిరే "ఎర్ర జెండాని" ఒక నిమిషం చూసే ధైర్యం లెనొన్ని
ఇంతకన్నా ఎం శిక్షించగలం ??????
"క్రాంతి" ("నీ")
( మహొజ్వలిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఇంటి చరిత్రగా భావించే మా కుటుంబం, ఉద్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం లో పుట్టి.. ఒక నర హంతకుడైన "నిజామ్ని" తెలంగాణ నిర్మాత, గొప్పోదు, వెయ్యిసార్లు కీర్తిస్తా అన్న కేసీయార్ మాటలు.. విని రక్తం మరిగి పోయినప్పుడు..)
కవిత -2
కేసీఆర్‌ను పక్కన పెట్టి
జరసేపు తెలంగాణ పల్లెల్ని చూడు తమ్మీ!
జీవనదులు గలగల బిరబిరా పారుతున్నా
పంటలు ఎట్ల ఎండిపోతున్నయో, రైతులు ఎట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నరో
ఎన్ని గోరీలు లేస్తున్నయో కండ్ల పడ్తది.
వరంగల్లు లో తాగనీకి కూడ నీళ్లు లేక
నాల్రోజులకోసారి నల్లాల దగ్గర జరిగే
గెరిల్లా యుద్ధం కండ్లార చూడొచ్చు.
విశాలాంధ్ర అంటే ఆంధ్రుల హృదయం
మా లావు ”ఇషాలం” అనుకున్నం గని
ఇంత విషముంటదనుకున్నమా?
నాటి దొరలు, జమిందార్లు, జాగిర్దార్ల కంటె అన్నాలంగ
మన నీళ్లను, పొలాలను, ఉద్యోగాలను
తిన్నింటి వాసాలను కాలబెడ్తరనుకున్నమా? పోలీసు చర్య ఎవర్ని ఉద్దరించింది? అధికారాన్ని ఏ పోరాట యోధులకు అప్పగించింది? మన ఆడోళ్లను బరిబాత బతుకమ్మలాడించినోళ్లకే కదా!
నిజాముకు ”రాజప్రముఖ్” బిరుదునిచ్చి,
”రాజభరణం” మంజూరు చేసి వాడు చచ్చేదాన్క
కాపలా కాసింది ఎవరు కేసీఆరా? తెలంగాణా సమరయోధులకు ఇప్పటికీ
స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు రాకుండా
అడ్డుకుంటున్నది ఈ అర్భకుడేనా? తెలంగాణా చరిత్రకు, తెలంగాణా సంస్కృతికి
పాఠ్య ప్రణాళికలో సముచిత స్థానం దక్కకుండా
తెలంగాణా మూలవాసులు తెలంగాణాలోనే
కాందీశీకుల్లా ఇతర్ల దయాదాక్షిణ్యాలపై
ఆధారపడి బతికే దౌర్భాగ్యం నీకు కనబడటంలేదా? కే సీ ఆర్ స్థానంలో నాటి కామ్రెడ్లే వుంటే
తెలంగాణా చరిత్ర మరో మలుపు తిరిగేది కాదా
ఆంధ్ర నేతల వల్లనే కదా ఎర్రజండా కూడా
వలసవాదుల కొమ్ము కాస్తోంది.
అసలు వాస్తవాల్ని గమనించకుండా
చారిత్రక తప్పిదాలు చేస్తూ ప్రజలకు
ఇంకా దూరం కాకు
జై తెలంగాణా అనడానికి ఇప్పటికైనా వెనుకాడకు.
Saturday, September 11, 2010
మాటలు వదలకండి...కత్తులు దిన్చకండి
తెలంగాణా వుధ్యమం చేసుకొనే హక్కు ప్రజలకు ఎలా వుందో సమైఖ్య ఆంధ్ర వుధ్యమం హక్కూ అంతే వుంది, అదే ప్రజాస్వామ్యం గొప్ప లక్షణం. కానీ ఈ పోరాటంలో భాగంగా రాజకీయనాయకులు మొదలు చదువుకున్నవారు, చాదువులేనివారు అనే తేడా లేకుండా ఆంధ్రా వారిని దోచుకొంటున్నారు.. దోచుకొంటున్నారు అని కొందరు విపరీత పద ప్రయోగం చూస్తుంటే అసహ్యం కలుగుతుంది?
ఆంధ్రా వారు దోచుకొనే దొంగలా ? ఐతే తెలంగాణా వారు దొరలా ?. తెలంగాణా వాడు తెలంగాణా లో దోచుకొంటే వాడిని ఏమంటారు ?. నిజానికి తెలంగాణాను ఆంధ్రా వాళ్ళు దోచుకోలేదు, తెలంగాణా రాజకీయ నాయకులే దోచుకొన్నారు, తెలంగాణా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళ పబ్బం గడుపుకుంటూ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధి ని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఏది ఏమైనా రాజకీయనాయకులు చేసిన తప్పిదాలకు గంపగుత్తగా ఆంధ్రా ప్రజలందరినీ దొంగలండం ఎంతవరకు సబబు ? విడిపోవడం తప్పదు ఐనప్పుడు న్యాయంగా ఎవరి వాటా వారికి వస్తుది, ఈలోగా ఇటువంటి విపరీత ఆరోపణలు చేసి మనసులు విరిచేసి, గుండెల్లో కత్తులు దించేసి ఇరువర్గాల ప్రజల మధ్య అగాధం సృష్టించడం తెలంగాణా వాదులకు న్యాయమా?
Subscribe to:
Posts (Atom)









