పై ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ? నాకైతే అవినీతి వ్యవస్థ (బండి) ని లాక్కు వెళ్ళుతున్న భారతదేశం(గుర్రం) కనిపిస్తుంది. మీకు తోచిన సరదా కామెంట్స్ పంపించండి.
Friday, October 15, 2010
అవినీతి లో నీతి...
ఈమధ్య హాట్ టాపిక్ గా మారిన విషయాలలో జగన్ ముందస్తుగా చెల్లించిన రూ.84 కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఒకటి. దీని మీద చంద్రబాబు తో సహా అనేకమంది అంత సొమ్ము కట్టడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, విచారణ జరపాలని డిమాండ్ చేసారు. ఐతే టాక్స్ ఎలా కట్టాడు, ఎందుకు కట్టాడు అన్న దాని మీద విచారణ జరగాలా లేక అంత టాక్స్ కట్టడానికి ఎంత డబ్బు దోచుకోన్నాడో, ఎలా దోచుకొన్నాడో అన్న దానిమీద విచారణ జరగాలా? ఒక బ్రహ్మాండమైన ఐడియా తో (సాక్షి కధనం ప్రకారం) దాదాపు ఏమి పెట్టుబడి లేకుండా భారతి సిమెంట్స్ లో 51% శాతం అమ్మి రూ .3000 కోట్లు పైగా వచ్చిన విషయం అందరికి తెలిసిందే, ఇలా అధికారం అడ్డంపెట్టుకొని వనరులను దోచుకొని సంపాదించిన అవినీతి సొమ్ముకి చాలా నీతి గా, పారదర్శకం గా పన్ను కట్టేసినందుకు అభినందించాలో లేక రాజమార్గంలో ఇకపై భారతి సిమెంట్స్ అవినీతిని నీతి గా మార్చినందుకు స్పందించాలో తెలియని పరిస్థితులలో చాలామంది పడిపోయారు. ఇకపై భారతి సిమెంట్స్ గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. కోట్లు అనే మాట ని చలి కాలం వేసుకొనే కోట్లు అనేంత ఈజీ గా తీసుకొనే విధంగా ప్రజల మనస్సులను మార్చేసిన ధన్య జీవి శ్రీ శ్రీ శ్రీ అవినీతి మహారాజ్ రాజశేఖర రెడ్డి కి దణ్ణం పెట్టుకొని ఓ బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
Sunday, October 10, 2010
ఒక సువర్ణావకాశం ....
బాబ్రి తీర్పు వచ్చి రెండు వారాలు అవుతుండగా ఇరుపక్షాల మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఎక్కడా కానరావడం లేదు. ఇప్పుడు వివాద స్థలం కేవలం 1500 గజాలకే పరిమితమైనట్టు (ముందు 2.7 ఎకరాలు అనుకోన్నట్టు కాకుండా) తేటతెల్లం ఐ౦ది.
దురదృష్ట వశాత్తు బాబ్రి మసీదు కూల్చివేత సంఘటన, గోద్రా అల్లరుల తరువాత ముస్లిం సమాజం భారతీయ భావనకు దూరంగా జరిగి వుగ్రవాదులకు వెన్నుదన్ను గా నిలవడం సమస్త భారతీయుల కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. కొంత మంది కి ఇది వర్తించక పోవచ్చ, కానీ దేహం భారత దేశంలోనూ ఆత్మ పాకిస్తాన్ లోను వున్న జనాభా ఎంత మంది లేరు ?
ముస్లిం చక్రవర్తుల దురహంకార దాడుల వల్ల అనేక మందిరాలు ధ్వంసం చేయబడి, జుట్టు కి కూడా పన్ను కట్టిన చరిత్ర తెలియంది ఏమి కాదు. బాబ్రి మసీదు గొడవ ఈనాటిది కాదు 18 శతాబ్దం నుండి నలుగుతూ వచ్చి చివరికి ఇప్పటికి ఒక సామరస్యమైన తీర్పు వచ్చింది. మందిరం శిధిలాల మీద మసీదు కట్టినట్టు, దానికి మందిరానికి చెందిన స్తంబాలను వాడినట్టు , వాటిపైన హిందూ దేవతా విగ్రహాలు చెక్కి వున్నట్టు న్యాయ మూర్తులు విస్పష్టంగా పేర్కొనడాన్ని ముస్లిం సమాజం నిశితం గా పరిశీలించి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వుంది .కోర్టులలో తీర్పుల ద్వారా చరిత్ర ను సరిచేయాలని చూడడం సరికాదు కానీ బాబ్రి విషయం శతాబ్దాల తరబడి వివాదాస్పదం గా వున్నందున న్యాయ పరిష్కారం తప్పలేదు.
ఇప్పుడు ముస్లిం సమాజం ముందు ఒక సువర్ణ అవకాసం నిలుచొని వుంది. బాబ్రి వివాదాన్ని కోర్టు సూచించిన విధంగా సామరస్యం గా పరిష్కరించుకోవడం గానీ, లేదా పూర్తిగా వదులుకొని పరిహారం గా వారికీ కావలసిన దానిని పొందటం కానీ చేయగలిగితే హిందూ, ముస్లిం ల మధ్య దూరం తగ్గించడమే కాకుండా వారి భారతీయ ఆత్మను ప్రదర్శించే ఒక గొప్ప అవకాశాన్ని పొందుతారు.
Tuesday, October 5, 2010
పోల్ రిసల్ట్ - ఈ క్రింది వారిలో అత్యంత అవినీతి పరుడు ఎవరు ?
మొత్తం పోల్ ఐన వోట్లు -91
రాజశేఖర రెడ్డి -69 (75%)
సి బి నాయుడు -18 (19%)
యన్ టి రామారావు -2 (2%)
యన్ జనార్ధన రెడ్డి - 2 (2%)
ఈ పోలింగ్ లో మహానేత రాజశేఖర రెడ్డి అందరికంటే ఎక్కువ ఓట్లతో (75%) అగ్ర భాగాన నిలిచారు. రెండవ స్థానం పొందిన చంద్రబాబు 19% ఓట్లతో రాజశేఖర రెడ్డి కి దరిదాపు కుడా రాలేక పోయారు.
ఇక పోతే మిగలిన ఇద్దరి గురించి రెండు మాటలు చెప్పాలి. అసలు ఈ పోల్ లోయన్ టి ఆర్, యన్ జె ఆర్ లను చేర్చాలని నేను భావించలేదు, ఐనా ఎందుకు పెట్టానంటే పోల్ లో పాల్గొనే వారు ఎంత వరకు నిజాయితీ గా ఓట్లు వేస్తారు అని కనుక్కోవడానికే. ఈ పోల్ వల్ల చాలా మంది నిజాయితీ గానే (96%) ఓట్లు వేస్తున్నారని తేలింది. వై యస్ ఆర్, సి బి నాయుడు కన్నా యన్ టి ఆర్, యన్ జె ఆర్ లు అవినీతి పరులని పేర్కోవడం అంటే ఇనుము కాదు బంగారనికే తుప్పు పడుతుందని చెప్పడమే. ( నేను ఒక పోల్ పెట్టి " తుప్పు పట్టే లోహం ఏది ?" అంటే "ఇనుము " బదులు "బంగారం " కి ఓట్లు వేసివారు 5% వరకు వుంటారని నా నమ్మకం)
Friday, October 1, 2010
ఎవరు నెగ్గినట్టు ?
అందరూ వూపిరి బిగబట్టి ఎదురుచూసిన బాబ్రి తీర్పు చివరికి నిన్న బయటకు వచ్చింది. బహుసా ఒక న్యాయ తీర్పు కోసం కని విని ఎరగని రీతిలో దేశం అంతటా రక్షణ చర్యలు తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటి సారి ఐ వుండవచ్చు.
ఇక తీర్పు విషయానికి వస్తే, ఇది అందరి విజయం అనుకొని గాని లేదా ఎవరి పరాజయం లేదు అని గాని అనుకొని ఏ వర్గం వారు వారికి అన్వఇంచుకొని సంతృప్తి పడినట్టు కనిపించినా, కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇందులో వున్నాయి .
1. బాబ్రి మసీదు హిందూ ఆలయం పునాదుల మీద నిర్మించ బడిందని ముగ్గురు న్యాయ మూర్తులు ఏకీభావించారు.
2. ఇద్దరు న్యాయమూర్తులు -జుస్టిస్ ధరం వీర్ శర్మ, జుస్టిస్ అగర్వాల్ లు హిందూ మందిరం కూలగొట్టబడిందని పేర్కొంటే, మూడో న్యాయమూర్తి జుస్టిస్ సిబ్గాత్ వుల్లా ఖాన్, మందిరం శిధిలా మైనదని (దానంతట అదే !!) పేర్కొన్నారు.
3. ఆర్కియాలజీ అఫ్ ఇండియా సర్వే ప్రకారం అక్కడ మందిరం వుందని నిర్ధారణ ఐనదని ప్రకటించారు.
కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఆర్టికల్ లో (న్యూస్ పేపర్ లో ) ఆర్కియాలజీ అఫ్ ఇండియా మందిరం వుందని నిర్దారించాలేదని చదివాను (ఆ ఆర్టికల్ వివరాలు, తేదీ గుర్తు లేవు). ఇప్పుడు తీర్పులో ఇలా చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఇకపోతే మొదటి ఇద్దరు న్యాయమూర్తులు కూలగొట్ట బడిందని అంటే, ఖాన్ గారు మందిరం శిధిలమైనదని చెప్పడం లో వాళ్ళ నిర్ణయాలను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటో అర్ధం గాలా.
మొత్తానికి తలా ఒక్కరికి ఒక ముక్క పంచి ఒడుపుగా తీర్పు చెప్పినప్పటికీ అసలు అక్కడ మందిరమే లేదని వాదిస్తూ వచ్చిన వారి మీద హిందువుల విజయం గానే భావించాలి. సహజం గానే ముస్లిం వర్గాలకు ఇది రుచించని పరిష్కారమే, అందుకే వారు సుప్రీం తలుపు తడతామంటున్నారు. దానికి కౌంటర్ గా కొన్ని హిందూ సంస్థలు మేమూ సుప్రీం కి వెళ్ళతాం అంటున్నాయి.
ఏది ఏమైనా జరిగింది చాలు, అక్కడ మందిరం అంటూ ఒకటి వుండేదని ముగ్గురూ తీర్మానించారు కనుక హిందూ, ముస్లింలు ఇక వివాదాన్ని సాగదీయకుండా వారు సూచించిన విధంగా సామరస్యం గా ముందుకు పోతే దేశానికి, సమాజానికి మంచిది.

Subscribe to:
Posts (Atom)