హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాల కూల్చివేత తో తెలంగాణా తెలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్ లను మించిపోయారని రుజువు చేసారు. ఆ తాలిబాన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసినప్పటికంటే ఈ తెలిబాన్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం సాక్షి గా చేసిన ధ్వంస రచన సమస్త తెలుగు జాతిని నివ్వెర పరచింది, ఎంతో ఆవేదనకు గురి చేసింది.
తెలంగాణా వుద్యమం తో కూల్చివేయబడ్డ కవులు, కళాకారులు, జాతి నిర్మాణ కారులకు ఏమి సంబంధమో రాజకీయ పార్టీ ముసుగు వేసుకొన్న తెలిబాన్లు చెప్పాలి. తెలంగాణా సాధన లో హింసా, అరాచకం ఒక భాగమా? ఇప్పటికే ఒక కుటుంబం రౌడీ రాజ్యం తెలంగాణలో రాజ్యం ఏలుతున్న లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఈ విధ్వంసం వెనుక ఎవరి హస్తం వుందో అందరికి తెలిసిందే. శాసన సభ సాక్షిగా జయ ప్రకాష్ నారాయణ మీద దాడి చేయించిన తే రా సా (తెలిబాన్ పార్టీ) ఇంత హీనస్థితికి దిగజారుతుందని ఎవ్వరూ వూహించలేదు. తెలిబాన్లు సాగించిన విధ్వంసం వారికేమి ప్రయోజనం సాధించిపెట్టిందో తెలీదు కానీ తెలంగాణా వస్తే హైదరాబాద్ లో తెలిబాన్ల ఆగడాలకు అంతు వుండదని అక్కడ వున్న ఇతర ప్రాంతాల వారి ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని నిర్ద్వందం గా నిరూపణ ఐంది.
అసలు ఈ విధమైన అసహనానికి ఈ తెలిబాన్లు ఎందుకు గురిఅవుతున్నారో సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా వెనుకుబాటుతనం, ప్రభుత్వ కేటాయింపులలో అన్యాయం కారణంగా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకుపోతున్న వారికి శ్రీ కృష్ణా కమిటీ రిపోర్ట్ రూపం లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అన్ని రంగాలను కూలంకుషం గా అధ్యయనం చేసిన కమెటీ తెలంగాణా వాదుల ఆరోపణ లలో పస లేదని తెలంగాణా అన్ని రంగాలలో ముందంజలో వుందని తేల్చి చెప్పింది. నిజంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని ఆధారాలతో సహా చూపింది. పరిశ్రమలు కూడా తెలంగాణాలోనే ఎక్కువ ఏర్పాటు అయ్యాయని రిపోర్ట్ తెలిపింది (కొద్ది గా ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువ వున్నట్టు కనిపించినా వాటిలో చాలా వరకు రైస్ మిల్లులే అని రిపోర్ట్ లో పేర్కొనడం గమనించాలి) గృహ, వ్యవసాయ తలసరి విద్యుత్ వినియోగం కూడా తక్కిన రెండు ప్రాంతాల వారికన్నా తెలంగాణాలోనే ఎక్కువ అని కమీటి ప్రకటించింది. శ్రీ కృష్ణ రిపోర్ట్ రుచించని తెలిబాన్లు అదంతా అబద్ధాలపుట్ట అని ఆరోపించడం మినహా వాటిని అబద్ధాలు గా నిరూపించే ఆధారాలు చూపడం గాని, లేదా అవాస్తవాలను ఖండిస్తూ వారి రిపోర్ట్ ని విడుదల చేయడం గాని చేయలేకపోయారు. శ్రీ కృష్ణా కమిటీ క్రోడీకరించిన వాస్తవాల ఆధారంగా విస్పష్టం గా సమైఖ్య ఆంధ్రా కే మొగ్గు చూపడం తో దానిని జీర్ణించుకోలేని ఈ తెలిబాన్లు ప్రజాస్వామ్య బద్ధం గా వుధ్యమాన్ని కొనసాగించలేమనే అందోళనతో ప్రజా ప్రతినిదులపైన పైన భౌతిక దాడులు, విధ్వంసాలకు దిగజారారు.
ఈ తెలిబాన్ నాయకులను మహాభారత యుద్ధంలో ఆశ్వద్ధామ తో పోల్చుకోవచ్చు, యుద్ధం చివరలో తను ప్రయోగమే కానీ అదుపు చేయడం తెలియని అస్త్రం ప్రయోగించి చివరకు దానిని గర్భంలో వున్న వుపపాండవుల (పాండవుల పిల్లలు)మీదకు మళ్ళిస్తాడు చివరకు శ్రీ కృష్ణుడు చేతిలో శాపానికి గురై చండాలమైన జీవితం గడుపుతాడు (అక్కడా ఇక్కడా యాదృచ్చికం గా ‘శ్రీ కృష్ణ’ దే ప్రధాన పాత్ర !).. ఈ తెలిబాన్ నాయకులు తెలంగాణా అస్త్రం వుపయోగించి దానిని అదుపుచేయలేక తెలంగాణా పిల్లలవైపు మళ్ళించడం తో ఈ రోజు తెలగాణా లో తల్లుల లకు గర్భశోకం మిగిలింది. నాయకుడనే వాడు అర్జునుడులా పూర్తి అదుపు వున్నవాడిలా వుండాలి కానీ ఆశ్వద్ధామ(తెలిబాన్ నాయకుల) లా వుండకూడదు.
చివరగా ఒక మాట ఏ లోకంలో వున్నాదో గాని విప్లవ కవి శ్రీ శ్రీ ఆత్మ, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల విధ్వంసం చూస్తే ఆయన వ్రాసిన ఒక గేయం “కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు...” అనే దానిని బహుసా ఇలా మార్చి వ్రాస్తాడేమో “కొంతమంది యువకులు పుట్టుకతో మూర్ఖులు, తెలిబాన్లకు బానిసలు, సమాజానికి చీడపురుగులు....”

విగ్రహాల విధ్వంసం తరువాత ఈ తెలిబాన్లు స్పందన కూడా వారి స్థాయి కి తగ్గట్టు గానే వుంది. వాళ్ళు చేసిన విమర్శ ‘ట్యాంక్ బండ్ మీద తెలంగాణా కవులుకు, వ్యక్తులకు’ స్థానం లేదా? అని. అసలు కవులు, కళాకారులు, సంఘసేవకులు, గొప్పనాయకులకు ప్రాంతాలతో ఏమి సంభంధం? ఒకవేళ ఎవరిదైనా విగ్రహం పెట్టాలని అనుకొంటే తెలియచేయడానికి ఇదా మార్గం?. తెలిబాన్ కి ఒక నాయకుడు కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం వాళ్ళ విగ్రహాలు పెట్టకపోతే ట్యాంక్ బండ్ మీద విగ్రహాల కు హామీ ఇవ్వలేమని అనడం ఈ తెలిబాన్లకు ఫైత్యం ఎంత ప్రకోపించిదో తెలుస్తుంది(బహుసా ఈ తెలిబాన్ నాయకులకు విగ్రహాలకోసం ఇప్పటినుండే కర్చిపులు వేసుకొంతున్నట్టున్నారు). మరో విమర్శ 600 మంది విద్యార్ధులు చనిపోగా లేనిది ఈ విగ్రహాలు కూలితే తప్పా? అసలు తలా తోకా లేని విమర్శ ఇది (బోడిగుండు కి మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే), విగ్రహాలే ఎందుకు కూల్చాలి? పోయి పోయి బిర్లా మందిర్ నో లేక చార్మినార్నో కూలిచి వేయవచ్చు కదా? లేదా సొంత కొంపలు కూల్చుకోవచ్చు కదా?. ఎంతో మంది విద్యార్ధులు చనిపోయారని మొసలి కన్నీరు కారుస్తున్న ఈ తెలిబాన్ నాయకులు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకు చావలేదో సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న ఒక టీవీ ప్రోగ్రాం లో ఈ తెలిబాన్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణా వుధ్యమం లో 500 మంది విద్యార్ధులు చనిపోయారు, సమైఖ్య ఆంధ్రా వుధ్యమం లో ఒక్క విద్యార్ధి ఎందుకు చనిపోలేదు? దీన్ని బట్టి తెలంగాణా వుధ్యమం బలంగా వుంది కనుక తెలంగాణా ఇచ్చెయ్యాలి అని ఒక సూత్రీ కరణ చేసాడు. అసలు ఏ వుధ్యమం లో ఐనా ఎవరినా ఎందుకు చనిపోవాలి? శవాలే వుద్యమ వుధ్రుతికి ప్రామాణికమా?సమైఖ్య ఆంధ్రా వుధ్యమంలో యువకులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదంటే కారణం అక్కడ బావోద్వేగాలను రెచ్చగొట్టే తెలిబాన్ నాయకులు వంటివారు ఎవ్వరూ లేరు. నేను గతం లో పోస్ట్ చేసిన ఒక ఆర్టికల్ లో నే స్పష్టం చేశా “చిదంబరం తెలంగాణా ప్రకటన తరువాత సీమాంద్ర ప్రాంతం లో గాలి కూడా ఆగింది అందుకే ప్రకటన వెనక్కు వెళ్ళింది” అని. ఒక మంచి నాయకత్వం అంటే ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, ప్రజలను సమీకరించాలి, వుధ్యమించాలి అంతే గాని బావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ శవాల వ్యక్తిగత స్వార్ధాలను తీర్చుకోవడం కాదు. ఈ రోజు తెలంగాణలో చనిపోయిన ప్రతి బిడ్డ తల్లి కి ఈ తెలిబాన్ నాయకులు సమాధానం చెప్పాలి.